Mega 156: మెగాస్టార్ కొత్త సినిమా టైటిలిదే.. వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠతో తన 156 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.2025 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా, దగ్గుపాటి రానా విలన్ గా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 

Mega 156: Megastar new movie titled.. Video shared by movie team

ఇక ఇప్పుడు విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ లో గ్రాఫిక్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.టీజర్ లోనే ఇలా ఉంటే, సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఏదో ఓ ముఖ్యమైనా వస్తువు వేరే యూనివర్స్ నుంచి భూమి మీద పడినట్లు టీజర్లో చూపించారు. ఆ వస్తువు చుట్టూనే మూవీ కథ అంతా నడవబోతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news