డాన్స్ తో కుమ్మేస్తున్న మెగా డాటర్.. వీడియో వైరల్..!!

-

మెగా డాటర్ నిహారిక గురించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలాగే బుల్లితెరపై కూడా ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై పలు షోలకు హోస్టుగా వ్యవహరించిన ఈమె ఆ తర్వాత వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో నటించి అలరించింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే నిహారిక ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకునే పనిలో ఉంది. ఇక వివాహం జరిగిన తర్వాత పూర్తిగా నటనకు దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడు బుల్లితెర షో లలో సందడి చేస్తూ వస్తోంది . ఇకపోతే నటిగా సినిమాలకు దూరమైనప్పటికీ నిర్మాతగా వెబ్ సిరీస్ లకు దగ్గర అయిందని చెప్పవచ్చు.

 

మధ్యకాలంలోనే ఒక ఓటీటీ ప్రాజెక్టును తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రతిభావంతురాలిగా , మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక సమయం దొరికినప్పుడు డాన్స్ తో సందడి చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా తన స్నేహితురాలితో కలిసి చేసిన డాన్స్ బాగా వైరల్ అవుతుంది.. ఒకటి కాదు రెండు కాదు వరుస పాటలకు బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ తీసుకోకుండా నిమిషం వ్యవధిలో ఎన్నో పాటలకు డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఒకేసారి ఇన్ని పాటలకు డాన్స్ చేయడం అందులోనూ అన్ని పాటలకు తగ్గట్టుగా డాన్స్ గుర్తు పెట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయమే అని చెప్పాలి.. ఇక నిహారిక ఆమె స్నేహితురాలు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అలాగే దివారియర్ లోని బుల్లెట్ బండి ఇలా ఎన్నో పాటలకు తన స్నేహితురాలు మృణాళితో కలిసి నిహారిక అందరినీ అబ్బురపరిచింది.

 

ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ గా మారింది.. నిహారిక టాలెంట్ కు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version