చిరు పుట్టిన రోజు కి మెగా డాటర్ సూపర్ సర్ప్రైజ్ వచ్చేసింది.. అభిమానులకి పండుగే

-

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 66వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు బర్త్​డే విషెస్ తెలియజేశారు. కాగా చిరు తనయ సుస్మితా కొణిదెల ఓ సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఇటీవలే తన భర్త విష్ణు ప్రసాద్​తో కలిసి గోల్డ్ బాక్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సుస్మిత వెబ్​ సిరీస్​ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్​ మోషన్ పోస్టర్​ను విడుదల చేశారు.

షూటవుట్ ఎట్ ఆలేరు’ అనే టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్​లో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్​లో బ్యాక్​గ్రౌండ్​లో కథను చెప్పేశారు. దీంతో క్రైమ్ థ్రిల్లర్​గా రూపొందుతోన్న ఈ సిరీస్​పై ఆసక్తి నెలకొంది.

నర్తిస్తే నటరాజు కూడా మెచ్చుకుంటాడు. నటిస్తే ప్రతి తెలుగు వాడు పొంగిపోతాడు. కనిపిస్తే ప్రతి అభిమాని ఆరాధిస్తాడు. రఫ్ఫాడిస్తా అంటూ ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. నేడు(ఆగస్టు 22) ఆయన 66వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిత్రసీమ ప్రముఖులు సహా అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news