రాష్ట్రంలో కరెంట్ కోతలంటూ కేసీఆర్ చేసిన ట్వీట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని అబద్ధం చెప్పారు అని మండిపడ్డారు. మహబూబ్నగర్లోనూ ఇప్పుడు అవే అబద్ధాలు చెప్పారు. కేసీఆర్కు మరీ ఇంత అధికార దాహం ఎందుకు? అని ధ్వజమెత్తారు.ఓడిన తర్వాత కూడా ఆయనకు ఇంకా గర్వం తగ్గలేదు. రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో కేసీఆర్ ప్రకటించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపి కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోంది. అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు ఉపయోగించుకుని 400 సీట్లు గెలవాలనుకుంటోంది అని ఆరోపించారు . అక్రమంగా, దౌర్జన్యంగా గెలవాలని ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.