ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో 503 నామినేషన్లను ఆమోదించిన అధికారులు 183 తిరస్కరించారు.
అటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3644 నామినేషన్లు దాఖలవగా.. 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపి, 939 తిరస్కరించారు. ఎల్లుండి వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు ఉండగా.. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. కాగా, మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు.