మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మెగా వారసుడు వరుణ్ తేజ్

-

సినిమా ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ అంటే అందరికీ చెప్పనక్కర్లేదు. ఇటీవలే రిలీజ్ అయిన సినిమా ‘ఆపరేష్ వాలంటైన్’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వని సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వరుణ్ తేజ్ కి సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.ఇతడు మొదట్లో కొంచం తక్కువ సినిమాలు చేసిన ప్రస్తుతం అతనికి అవకాశాలకు కొదవలేదు.ప్రస్తుతం ఇప్పుడు’మట్కా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ దశలో ఉంది.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్-యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయని సమాచారం.ఏడాది గ్యాప్ అనంతరం వరుణ్ తేజ్ కోసం ఎలాంటి స్టోరీ రాసాడు?అన్నది తెలియాలి.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` తో మేర్లపాక దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. వరుణ్ ప్రస్తుతం నటిస్తోన్న `మట్కా`పైనా చాలా ఆశలే పెట్టుకున్నాడు.ఆయన కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రమిది.ఇది పాన్ ఇండియాలో చేస్తోన్న చిత్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version