పాడేందుకు సిద్ధం అవుతున్న మెగా హీరో..?

-

మెగా మేనల్లుడు గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ తక్కువ సమయంలో ఎంతో గుర్తింపు సంపాదించుకుని సుప్రీం హీరో గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. అచ్చంగా మేనమామ చిరంజీవి పోలిక లను కలిగి ఉండే సాయి ధరంతేజ్ మామయ్య హావభావాలను కూడా సినిమాలో అచ్చుగుద్దినట్టు గా దింపేస్తూ ఉంటాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో వరుసగా విజయాలు అందుకుని ఆ తర్వాత మాత్రం ప్లాపులతో సతమతం అయిన విషయం తెలిసిందే.

కానీ చిత్రలహరి సినిమాతో మళ్లీ ట్రాక్ లో పడ్డ మెగా మేనల్లుడు ఆ తర్వాత ప్రతి రోజు పండుగ అనే సినిమాతో మళ్లీ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో సిద్ధమవుతున్నాడు. అయితే కేవలం నటించడమే కాదు తన వాయిస్ తో కూడా ప్రేక్షకులను అలరించడానికి మెగాహీరో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో ఏకంగా పాటలు పాడేందుకు కూడా మెగా హీరో సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news