తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఐదవ సోదరి చీటీ సకలమ్మ మరణించారు. 82 సంవత్సరాలు ఉన్న సకలమ్మ… అర్ధరాత్రి మరణించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా వయోభారం అలాగే అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారట.
ఇక తాజాగా ఆమె పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే శుక్రవారం రాత్రి ఆమె పరిస్థితి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక వయసు పైబడడంతో ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిందట.. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె మృతదేహాన్ని హైదరాబాదులోని ఓల్డ్ ఆల్వాల్ లో… కెసిఆర్ సోదరి ఇంటికి తరలించారు. ఇక ఆమె మృతితో కేసిఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. నెలకొంది. ఇక ఆమె మరణించడంతో హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారట కేసీఆర్. ఫామ్ హౌస్ నుంచి నేరుగా అల్వాల్ వెళ్ళనున్నారట.