రామ్ చరణ్ ఆల్ టైమ్ హిట్ మగధీర రీరిలీజ్ కు సిద్ధం.!

-

ఇక ఇప్పుడు తెలుగు లో స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ఒక ఉద్యమం లాగా ఉంది. ఈ రిలీజ్ రికార్డ్స్ కూడా సెట్ చేయాలని అందరు హీరోల ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో సినిమా చూడడం ను ఎంజాయ్ చేయాలి కాని సీట్లు చించడం, స్క్రీన్స్ చించడం, థియేటర్ లో మంటలు వేయడం చేసి హీరోల పరువు తీస్తున్నారు.వారి హీరో కు ఇది మంచి చేస్తుందా లేక చెడ్డ పేరు తీసుకు వస్తుందా అని కూడా ఆలోచించడం లేదు. ఇక కొంత మంది ఫ్యాన్స్ మాత్రం జెన్యూన్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక ఈ రీ రిలీజ్ గోల లోకి పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా దూకుతున్నారు. మేకర్స్ కూడా వాళ్ళకు మద్దతుగా ఉన్నారట. ఇక రామ్ చరణ్ కెరియర్ లో రెండో సినిమా గా వచ్చిన మగధీర అప్పట్లో ఇండ్రస్టీ రికార్డ్ నెలకొల్పిన సంగతి అందరికి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా పరిశ్రమ లో సంచలనంగా మారింది.

magadheera
magadheera

ఈ చిత్రాన్ని కూడా RRR తీసిన దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం  రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ని ఈ ఏడాది చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేయాలని సినిమాని నిర్మించిన గీతా ఆర్ట్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమా రీ రిలీజ్ అయితే మెగా ప్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news