ఏపీలో వ్యాక్సిన్ బిగ్ డే డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది సర్కార్. ఇవాళ 8-10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం… ఇప్పటి వరకు రోజుకు 6 లక్షల మందికి ఒకే రోజు టీకాలు వేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు గతంలో నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్ చేసింది ఏపీ. ఇవాళ 12 లక్షల మందికి టీకాలు వేయచ్చని అధికారులు అంచనా వేస్తోన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,11,142 మందికి టీకాలు వేయగా… అత్యల్పంగా 41,643 మందికి కరోనా టీకాలు వేసింది సర్కార్.
ఈ ఒక్క రోజే ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో లక్ష దాటిన కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కాగా.. రేపట్నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వర్తించనున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 30వ తేదీ వరకు మారిన సడలింపు నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.