మెగాఫ్యామిలీ దివాళి సెల‌బ్రేష‌న్స్…బ‌న్నీ క‌లిసిపోయాడుగా..!

-

పండ‌గ‌లైనా శుభ‌కార్యాల‌యినా మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి సంద‌డి చేస్తుంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా అంతా ఒక్క చోట చేరి పండ‌గ‌లు జ‌రుపుకున్నా అల్లు అర్జున్ మాత్రం క‌నిపించ‌లేదు. దాంతో బ‌న్నీ మెగా ఫ్యామిలీకి దూర‌మ‌వుతున్నారంటూ ర‌కర‌కాల పుకార్లు చెక్క‌ర్లు కొట్టాయి. అయితే ఆ పుకార్లకు చెక్ పెట్టేలా అల్లు అర్జున్ దీపావ‌ళి సంధ‌ర్బంగా కుటుంబంతో క‌లిసి సంద‌డి చేశారు. దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ సంధ‌ర్బంగా అంతా ఒక్క చోట చేరి వేడుక జ‌రుపుకుంటున్న ఫోటోను చ‌ర‌ణ్ మ‌రియు అల్లు అర్జున్ లు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

megafamily diwali celebrationsmegafamily

ఈ ఫోటోలో వైష్ణ‌వ్ తేజ్ తో పాటు మెగాస్టార్ అల్లుల్లు కూతుళ్లు ఉన్నారు. నిహారిక తో పాటు ఆమె భ‌ర్త కూడా ఉన్నాడు. అయితే ఫోటోలో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం కనిపించ‌లేదు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కు ఇటీవ‌ల యాక్సిడెంట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న రెస్ట్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి బన్నీ మాత్రం మెగా ఫ్యామిలో సంద‌డి చేయ‌డంతో అభిమానులు కుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version