కల్కి మూవీ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపించిన మెగాస్టార్

-

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ ఈరోజు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ఆయన ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ‘ఈ తరహా సైన్స్ ఫిక్షన్ సినిమా తీసిన నాగ్ అశ్విన్కు అభినందనలు. నాకు ఇష్టమైన నిర్మాత అశ్వినీదత్, ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక, మొత్తం మూవీ టీమ్కు కంగ్రాట్స్. ఇలాగే కలలు కని భారత జెండాను మరింతపైకి ఎగురవేయండి’ అని పోస్ట్ చేశారు.కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news