మాటల్లేవ్… గౌతంరెడ్డి ప్లానింగ్ అద్భుతః అంటున్నారు!

-

మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే… పబ్లిసిటీ లేకుండా, మీడియాకు లీకులు లేకుండా, పాంప్లెట్స్ విడుదలకౌ కూడా చేసే పనికిమాలిన హడావిడి లేకుండా ప్రస్తుత ప్రభుత్వం సైలంట్ గా అనుకున్నది అనుకున్నట్లు చేసుకుపోతుంది! అది ప్రభుత్వ పథకాల్లోని కొత్త నిర్ణయాలు అయినా.. సమాజిక విషయాలకు సంబందించిన ఆలోచనలు అయినా… ప్రభుత్వం దగ్గర ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యే వరకూ ప్రపంచానికి తెలియడం లేదు! ఫలితంగా మాటలు కాదు చేతలు ముఖ్యం అనే పంథాలో జగన్ సర్కార్ ముందుకుపోతున్నట్లుంది. ఇందులో భాగంగా మేకపాటి గౌతంరేడ్డి చేస్తున్న పనులను ప్రస్థావించుకోవచ్చు!

ఇందులో భాగంగా… జపాన్ ‌కు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్ (జేబీఐసీ), జపాన్‌ ప్రీమియర్‌ ఫైనాన్షియల్‌ ఇన్స్టిట్యూషన్ (జేపీఎఫై), జపాన్‌ ఇంట ర్నే షనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ), ప్రీమియర్‌ జపాన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పీజేడీఏ), కునియమి ఎసెట్‌ మేనేజ్ ‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలు.. ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు వాటితో చ‌ర్చలు జ‌రుపుతున్నారు ఏపీ ప‌రిశ్రమ‌ల శాఖామంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి! ఫలితంగా రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణాల విషయంలో మరింత దూకుడుకు తోడ్పాటు వస్తుంది.

ఇదే క్రమంలో… అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌) క్రెడిట్‌ రేటింగ్ ‌తో ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి ఈ సంస్థలు తొడ్పాటును అందించ‌నున్నాయి. ఎక్కడా హ‌డావిడి లేకుండా.. పనయ్యేవరకూ విషయం బ‌య‌టపడకుండా.. ప్రతిప‌క్షాల విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా మేక‌పాటి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version