దేవుడా… మగాడ్ని కూడా వదిపెట్టట్లేదు ఆ కామాంధులు..

-

రోజురోజుకు నేటి సమాజంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. చిన్నా పెద్దా లేకుండా స్త్రీ జాతిపై పడి మృగాళ్లు తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే.. ఆఖరికి మగాడ్ని కూడా ఈ కామాంధులు వదిలిపెట్టడం లేదు. ఓ జైలులో తోటి ఖైదీపై లైంగిక దాడికి పాల్పడ్డడో దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. అర్ధ‌ర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అత‌డిని లైంగిక వేధింపుల‌కు గురిచేసిన టీనేజ‌ర్ (19)పై కేసు న‌మోదైంది. వేర్వేరు నేరారోప‌ణ‌ల‌పై కొద్ది నెలలుగా ఇద్ద‌రినీ ఒకే బ్యార‌క్‌లో ఉంచ‌గా తోటి ఖైదీ( 20) పై నిందితుడు ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.

అధికారుల‌కు బాధితుడు జైలు ఈ విష‌యం తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న గురించి ఎవ‌రికైనా చెబితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని నిందితుడు త‌న‌ను బెదిరించాడ‌ని వెల్లడించాడు బాధితుడు. నిందితుడిపై పోలీసులు అస‌హ‌జ నేరాలు స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుత చ‌ట్టాల ప్ర‌కారం 16 ఏండ్లు పైబ‌డిన పురుష బాధితుల‌పై లైంగిక దాడిని భార‌త శిక్షా స్మృతి గుర్తించ‌దు. పురుషుడు ఓ మ‌హిళ‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేస్తే దాన్ని లైంగిక దాడిగా ప‌రిగ‌ణిస్తుంది. మైన‌ర్ బాలురపై లైంగిక దాడులు పోక్సో కింద లైంగిక వేధింపులుగా ప‌రిగ‌ణిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version