మానసికంగా దృఢంగా ఉన్నవారినే విజయం వరిస్తుంది.. అలాంటి విజయం కావాలంటే,

-

శారీరక అనారోగ్యం నుండి బయటపడాలంటే మానసిక ఆరోగ్యం బాగుండాలి. కానీ దురదృష్టం ఏమిటంటే, శారీరకంగా బాగాలేనపుడు మానసికంగానూ కుంగిపోతారు. ఐతే మానసికంగా దృఢంగా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలో చాలామంది తమది కాని బాధల గురించే ఎక్కువగా బాధపడుతుంటారు. అలా కాకపోయినా తమకి పెద్దగా హాని చేయని వాటి గురించే ఏదో చేస్తుందని భ్రమించి బాధపడుతుంటారు. ముందుగా మీకేమీ కావాలో నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోలేకపోతే ఏది సరైన బాదో, దేనికి బాధపడాలో తెలియక సతమతం అవ్వాల్సి వస్తుంది. అందుకే అన్నింటికీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటీ పోవద్దు. దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదో తెలుసుకోవాలి.

అనారోగ్యం గురించిన చింత చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉన్నా రేపేం జరుగుతుందో అన్న భయం ఎక్కువ. ఐతే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని ప్రపంచంలో మనం ఉన్నాం. ఆనందం అనేది అందనిగా మారుతున్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఇలాంటి టైమ్ రేపేం జరుగుతుందో అని బాధపడుతూ కూర్చోవద్దు. ఇప్పటి క్షణాన్ని అనుభవించకుండా రేపెలా ఉంటుందో, రేపు బాగుండాలని ఈరోజు బాధపడుతూ ఉండవద్దు.

బాధ్యతలని బరువులుగా మోస్తూ అదే జీవితం అనుకుంటూ గడపకండి. బాధ్యత అయినా మీకు సంతోషం ఇస్తేనే జీవితానికి విలువ ఉంటుంది. అలా కానప్పుడు మీలో మానసికంగా చాలా మర్పులు వస్తాయి. ఆనందం, సంతోషం దూరమవుతాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారే అందంగా నవ్వగలరు. అందంగా నవ్వినవారే ఆరోగ్యంగా ఉండగలరు. ఎంత డబ్బు సంపాదించినా ఆనందం అనేది మన చేతిలో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే గెలుపు అదే వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version