ఎస్సీ, ఎస్టీలను దగా చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య : మేరుగు నాగార్జున

-

ఎస్సీ, ఎస్టీలను దగా చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు మంత్రి మేరుగు నాగార్జున. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్దంగా వచ్చిన హక్కులను హరించటం వారికి అలవాటు అయ్యిందని, టీడీపీ అహంకార పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా కూడా దళిత వ్యతిరేకులు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్యను, అమరావతి ప్రాంతంలో దళితులకు భూమి ఇస్తామంటే వ్యతిరేకిస్తారు. చంద్రబాబు తన హయాంలో దళితులకు చేసిన ఒక మంచి పనిని చెప్పగలడా?. అంబేద్కర్ విగ్రహాన్ని కడతామని చెప్పిన చంద్రబాబు ఎందుకు ఆ పని పూర్తి చేయలేదు. దళితుల గౌరవంతో తలెత్తుకునేలా చేస్తున్న నాయకుడు జగన్. ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు చెప్పలేదా?. బీసీ కులాల తోకలు కత్తిరిస్తానని అహంకారం ప్రదర్శించింది చంద్రబాబు కాదా?.’ అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు శకం ముగిసింది. దళితులకు, పేదలకు శాచ్యురేషన్ విధానంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం మాది. అంబేద్కర్ చెప్పిన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోంది. చంద్రబాబు మా వర్గాలకు చేసిన మోసాలు మా గుండెల్లో గునపాల్లా ఇంకా గుచ్చుకుంటూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పైసా దళితుల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. దళిత సంక్షేమానికి, అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా జగన్ పాలన చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పొరేషన్‌కు వాహనాల కొనుగోళ్ళల్లో అవకతవకల అంశాన్ని సీఐడీకి అప్పగించాం. 48 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌ల రూపంలో ప్రభుత్వం చెల్లించింది. కానీ వాహనాలను మాత్రం డెలివరీ కాలేదు. అని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version