హైదరాబాద్ లో మెట్రో రైలు వచ్చిన తరువాత కొంత వరకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయని చెప్పాలి. మెట్రో రైలు వలన చాలా వరకు అవకాశం ఉన్నంత మేరకు ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే ప్రజలకు మెట్రో ఎంతగా ఉపయోగపడుతున్నది గ్రహించిన ప్రభుత్వం ఇంకా మెట్రోను విస్తరింపచేయడానికి ప్రణాలికలు చేసింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మెట్రో రైల్వే ను తెలంగాణ ప్రభుత్వం రూ. 60 వేల కోట్ల నిధులతో భారీగా విస్తరించనున్నది. ఈ విషయాన్నీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలియచేశారు. ఇందులో భాగంగా JBS – తూముకుంట, ప్యాట్నీ – కండ్లకోయ మార్గాలలో డబుల్ డెక్కర్ మెట్రో ను నిర్మిస్తారు. ఇక మియాపూర్ – ఇస్నాపూర్, మియాపూర్ – లక్డికాపూల్ మార్గంలో మరో మెట్రోను నిర్మిస్తారు.
మరియు LB నగర్ – పెద్ద అంబర్ పేట, ఉప్పల్ – BB నగర్, ఉప్పల్ – ECIL, శంషాబాద్ – కొత్తూరు, షాద్ నగర్, కందుకూర్ ల మీదుగా మెట్రో ను విస్తరించడానికి ప్లాన్ చేశారు. వీటిని నిర్మించడానికి దాదాపుగా 3 నుండి 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.