హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్లే మార్గంలో ఉన్నట్టుండి రైలు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేటలో ఏకంగా 13 నిమిషాల పాటు సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై మెట్రో సర్వీసు నిలిచిపోవడంతో ఆ దారి గుండా వెళ్లే అన్ని సర్వీసులు ఆగిపోయాయి.
సాధారణంగా నాగోల్- రాయదుర్గ్ మార్గంలో నిత్యం వందలాది ప్యాసింజర్స్ జర్నీ చేస్తుంటారు.ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారు ఈ సమయంలో ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తారు. అనుకోకుండా మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు, ఇతర జాబర్స్, విద్యార్థులు నానా అవస్థలు పడినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్య వల్లే ఈ సమస్య తలత్తగా.. సమస్య పరిష్కరించాక తిరిగి సర్వీసులు ప్రారంభమైనట్లు తెలిసింది.