విద్యార్థుల తల్లిదండ్రుల సలహాల మేరకు పాఠశాలలను తెరవనున్న ఎంహెచ్‌ఆర్డీ..!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పాఠశాలలను తిరిగి త్వరలోనే ప్రారంభించాలా లేదా అన్న విషయంపై మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలను కోరింది. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌, ఏ నెలలో పాఠశాలలు తెరవాలా అన్న అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయాన్ని మంత్రిత్వ శాఖ కోరుతుంది.

 

school
school

 

అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల విద్యా కార్యదర్శులు సోమవారం నుంచి తల్లిదండ్రుల సూచనలను సమర్పించాలని ఎంహెచ్‌ఆర్డీ అధికారులు ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను గురించి తల్లిదండ్రుల ఒక అంచనా వేసి పాఠశాలలు ఎప్పుడు తెరవాలో అనే దానిపై సూచనలు ఇవ్వాలని ఎంహెచ్‌ఆర్డీ అడుగుతుంది. పాఠశాలలు పునః ప్రారంభానికి సంబంధించి ఏదైనా ఇతర అభిప్రాయం లేదా సూచనను కూడా ఎంహెచ్‌ఆర్డీ కి సమర్పించవచ్చు. తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ఎంహెచ్‌ఆర్డీ కు ఇమెయిల్ ద్వారా ప్రతి రాష్ట్రం యొక్క విద్యా కార్యదర్శి అందించాల్సి ఉంటుంది.

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి నెల మధ్యభాగం నుండి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలు కాలేజీలు మూసివేయబడ్డాయి. ఐతే పాఠశాలలను తిరిగి తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాన్ని ఎంహెచ్‌ఆర్డీ కోరుతుంది. భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ హెల్త్ చేసిన అనంతరం పాఠశాలలు తెరిచేందుకు సరైన మార్గదర్శకాలను రూపొందించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకుల నుండి సలహాలను ఎంహెచ్‌ఆర్డీ కోరుతుంది.