షావోమి తన సంస్థ నుంచీ వచ్చే ఉత్పత్తులలో కొత్తదనం పరిచయం చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఎంతో తక్కువ ఖర్చుతో సామాన్యులకి సైతం అందుబాటులో ఉండే ధరలతో ఉత్పత్తులని మార్కెట్ లో కి దింపుతుంది. గతంలో చాలా తక్కువ ధరకే ఎల్ఈడీ బల్బులు తీసుకువచ్చిన Mi వినియోగదారులని ఎంతగానో ఆకర్షించింది. ఈ క్రమంలోనే Mi మరో కొత్తరకం బల్బుని తీసుకువచ్చింది.
దానిపేరు Mi Motion activated night light 2. ఈ లైట్ ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది ఓ మ్యాజిక్ లైట్ లా పని చేస్తుంది. ఈ లైట్ ని మనం ఒక చోట పెట్టి ఉంచితే దాని పరిసరాల్లోకి ఎవరు వెళ్ళినా సరే ఒక్క సారిగా కాంతి ఇస్తూ వెలుగుతుంది. ఇది వినగానే ఇలాంటిది ఇంట్లో ఉంటే బాగుంటుంది అని పించేలా ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతమైన టెక్నాలజీతో తయారు చేశారు.
ఇక ఈ లైట్ ధర కేవలం 500 రూపాయలు మాత్రమే. ఈ లైట్ ని మీకు నచ్చిన ప్రదేశంలో పెట్టుకోవచ్చు. దీనికి కరెంట్ తో చార్జింగ్ కూడా అవసరం లేదు. కేవలం ఇది బ్యాటరీల సాయంతో పని చేస్తుంది. దీనిలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే. దీని మన అవసరానికి తగ్గట్టుగా రెండు విధాలుగా మార్చుకోవచ్చు. ఈ లైట్ ని 360 డిగ్రీ యాంగిల్ లో ఎటువైపు అయినా తిప్పుకోవచ్చు.