మొబైల్స్ తయారీదారు షియోమీ గత నెల రోజుల కిందట భారత్‌లో ఎంఐ నోట్‌బుక్ 14, ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన విషయం విదితమే. వీటిని కొనుగోలు చేసేందుకు అధిక శాతం మంది వినియోగదారులు ఆసక్తిని చూపించారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లను కేవలం ఫ్లాష్ సేల్స్‌లోనే ఇప్పటి వరకు విక్రయించారు. కానీ వీటిని షియోమీ ప్రస్తుతం ఓపెన్ సేల్‌లోనూ విక్రయిస్తోంది. అంటే.. వినియోగదారులు వీటిని ఇకపై రోజులో ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు.
షియోమీ భారత్‌లో లాంచ్ చేసిన మొదటి ల్యాప్‌టాప్‌లు ఇవే కావడం విశేషం. కాగా వీటిలో ఇంటెల్ 10వ జనరేషన్ ప్రాసెసర్‌లను ఏర్పాటు చేశారు. అలాగే ల్యాప్‌టాప్‌లు వేగంగా పనిచేయడం కోసం ఇందులో ఎస్ఎస్‌డీల సదుపాయం కూడా అందిస్తున్నారు.
ఎంఐ నోట్‌బుక్ 14 ల్యాప్‌టాప్ 256జీబీ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 512 జీబీ వేరియెంట్ ధర రూ.44,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియెంట్‌ను రూ.47,999 ధరకు విక్రయిస్తున్నారు. అలాగే ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్ రెండు వేరియెంట్లలో, భిన్న ప్రాసెసర్లతో లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ కోర్ ఐ5 వేరియెంట్ ధర రూ.54,999 ఉండగా, కోర్ ఐ7 వేరియెంట్ ధర రూ.59,999గా ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ కింద హారిజాన్ ఎడిషన్ ల్యాప్‌టాప్‌లపై రూ.2వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లు 10 గంటల వరకు బ్యాకప్‌ను ఇస్తాయి.