చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌ని నాశనం చేసే వ్యాక్సిన్‌ని కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకలు పోటీ పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కరోనా వాక్సిన్ ట్రయల్స్ పూర్తి చేసినట్టు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేస్-3 హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేసినట్టు యూనివర్సిటీ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి అని తెలిపింది. ఆక్సఫర్డ్ యూనివర్శటీ లైసెన్స్ పొందిన ప్రముఖ ఇండియన్ ఫార్మా కంపెనీ ఆస్టాజ్రెనెకా వాక్సిన్‌కు ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇంకా ఈ వ్యాక్సిన్ కి సంబంధించి డేటాను సోమవారం జులై 20వ తేదీన విడుదల చేయనున్నారు.