IPL MI vs RCB : బెంగ‌ళూర్ ఘ‌న విజ‌యం.. ముంబైకి నాలుగో ఓట‌మి

-

ఐపీఎల్ 2022లో భాగంగా శ‌నివారం ముంబై ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్ల మ‌ధ్య 18 వ మ్యాచ్ జ‌రిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మ్యాచ్ సక్స‌స్ ఫుల్ జ‌ట్టు అయిన ముంబై ఇండియ‌న్స్ కి వ‌ర‌స‌గా నాలుగో ఓట‌మి ఎదురైంది. ముంబై ఇండియ‌న్స్ ఇచ్చిన 152 ప‌రుగుల టార్గెట్.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ సునాయాసంగా ఛేదించింది. మ‌రో 9 బంతులు ఉండ‌గానే ల‌క్ష్యాన్ని అందుకుంది.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ ఓపెన‌ర్లు.. డు ప్లెసిస్ (16) విఫ‌లం అయినా.. అనుజ్ రావ‌త్ (47 బంతుల్లో 66) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 2 ఫోర్లు, 6 సిక్స్ ల‌తో వీర వీహారం సృష్టించాడు. అలాగే విరాట్ కోహ్లి (48) కూడా రాణించాడు. అయితే ఈ ఇద్ద‌రు వ‌రస‌గా అవుట్ కావ‌డంతో చివ‌ర్లో దినేశ్ కార్తిక్ ( 2 బంతుల్లో 7 నాటౌట్), మాక్స్ వెల్ (బంతుల్లో 8 నాటౌట్) ఒక‌దాని త‌ర్వాత ఒక్క బౌండ‌రీ బాదారు.

దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూర్ మ‌రో 9 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్ ను అందుకుంది. 66 ప‌రుగులు చేసిన అనుజ్ రావ‌త్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version