Legendaries: ఒకే ఫ్రేమ్‌లో సుకుమార్, మణిరత్నం, రాజమౌళి.. ఎక్కడ కలిశారో మీకు తెలుసా?

-

సినీ పరిశ్రమ గర్వించే దర్శకుల్లో ఒకరు మణిరత్నం. హిట్స్, ఫ్లాప్స్ అనే విషయం పక్కనబెట్టి సినిమా మేకింగ్‌లో తనదైన స్థాయి ప్రతిభను కనబరిచి ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ పెంచిన వ్యక్తిగా మణిరత్నం చరిత్రలో నిలిచిపోతారని చెప్పొచ్చు. లెజెండరీ దర్శకుడిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు కూడా. ప్రస్తుతం ఆయన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. అటువంటి గొప్ప దర్శకుడిని తెలుగు దర్శకులైన రాజమౌళి, సుకుమార్ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. వారితో పాటు నటులు జయరాం, జయం రవి కూడా తోడయ్యారు.

ఒకే ఫ్రేమ్ లో వీరంతా సందడి చేశారు. ఈ లెజెండరీ డైరెక్టర్స్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు. వీరు ముగ్గురు ఎక్కడ కలిశారు? వీరు ఏదేని పిక్చర్ తీస్తున్నారా? అని ప్రశ్నలు వేస్తున్నారు. కాగా, వాటన్నిటికి సమాధానం వీరు కలుసుకున్న ప్లేస్ ద్వారా స్పష్టమవుతుంది. ఇంతకీ వీరు ఎక్కడ కలిశారంటే.. సీఐఐ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

ఆ కార్యక్రమంలో పాల్గొన్నాక వీరు ఇలా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ముగ్గురు లెజెండ్స్..తమ సినిమాల ద్వారా ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లగలరు. RRR సినిమాతో రాజమౌళి ప్రపంచంలోనే గొప్ప దర్శకుడు అయిపోయారు. సుకుమార్ ‘పుష్ప’ చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను దేశవ్యాప్తం చేశారు.

ఇక మణిరత్నం సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. వీరి ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉండటం చూసిన అభిమానులు.. వీరు ముగ్గురు కలిసి ఓ సినిమా చేయాలని, అప్పుడు అది చాలా పెద్ద ఫ్రాంచైజీ అవుతుందని కొందరు అభిమానులు అంటున్నారు. రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ మహేశ్ బాబుతో చేయనున్నారు. సుకుమార్ ‘పుష్ప2’ మూవీ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో హీరో కాగా, హీరోయిన్ రష్మిక మందన.

Read more RELATED
Recommended to you

Exit mobile version