సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ జపాన్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 2300 మంది ఉద్యోగులకు వారంలో 3 రోజులు వీక్లీ ఆఫ్‌లను ఇస్తున్నట్లు తెలిపింది.
నగరాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు సహజంగానే నిత్యం మానసిక ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. దానికి తోడు పనిభారం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో వారు ఆ టెన్షన్ల నడుమ తమ తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు చాలా తక్కువ సమయం కేటాయిస్తుంటారు. అయితే ఈ విషయాన్ని గమనించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ దేశంలోని తమ ఉద్యోగులకు వారంలో ఏకంగా 3 రోజుల పాటు వీక్లీ ఆఫ్‌లను ఇచ్చింది. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ జపాన్‌లోని తన కార్యాలయంలో పనిచేస్తున్న 2300 మంది ఉద్యోగులకు వారంలో 3 రోజులు వీక్లీ ఆఫ్‌లను ఇస్తున్నట్లు తెలిపింది. వర్కింగ్ రిఫార్మ్ ప్రాజెక్ట్‌లో భాగంగా కేవలం ఒక నెల పాటు ఇలా వీక్లీ ఆఫ్‌లను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఎక్కువగా కేటాయించడం లేదని, దీంతోపాటు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని గమనించిన మైక్రోసాఫ్ట్ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
అయితే ఆ నెలలో అలా ఉద్యోగులకు వారంలో 3 రోజుల పాటు సెలవులు ఇవ్వడం వల్ల వర్క్ ప్రొడక్షన్ ఏకంగా 39 శాతం వరకు పెరగడంతోపాటు ఉద్యోగులు ఇంతకు ముందు కన్నా ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. అలాగే టీ, కాఫీలు తాగేందుకు, ఇతర పనులకు ఆఫీసు టైం వృథా చేయడం లేదని, అందుకనే వారంలో 3 రోజులు (శుక్ర, శని, ఆది) వీక్లీ ఆఫ్‌లను ఇచ్చినా వర్క్ ప్రొడక్షన్ ఏమాత్రం తగ్గకపోగా ఇంకా పెరిగిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ విధానాన్ని ఇక అక్కడ కంటిన్యూ చేయాలని కూడా మైక్రోసాఫ్ట్ ఆలోచిస్తోంది. అవును మరి.. నిజంగా ఇది చాలా మంచి ఆలోచనే కదా..!