ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 11ను లాంచ్ చేసింది. తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్‌ను విడుదల చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సింపుల్ డిజైన్‌ను అందిస్తున్నారు. దీని వల్ల యూజర్లకు మరింత సౌకర్యవంతమైన ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. అలాగే స్టార్ట్ మెనూను మధ్యలో ఏర్పాటు చేశారు. ఇంకా ఎన్నో సదుపాయాలను ఈ కొత్త ఓఎస్ లో అందిస్తున్నారు.
కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్నాప్ లే అవుట్స్, స్నాప్ గ్రూప్స్ ఫీచర్లను అందిస్తున్నారు. దీంతో మల్టీ టాస్కింగ్ సులభతరం అవుతుంది. విండోస్‌ను సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే వర్క్, గేమింగ్, స్కూల్ వంటి ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకమైన డెస్క్‌టాప్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక కొత్త ఓఎస్‌లో విడ్జెట్లను అందిస్తున్నారు. దీంతో న్యూస్ ఫీడ్ లోని వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే కొత్త మైక్రోసాఫ్ట్ స్టోర్ లభిస్తుంది. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యాప్స్‌కు సపోర్ట్ లభిస్తుంది.
విండోస్ 11లో సరికొత్త గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందవచ్చు. అందుకుగాను డైరెక్ట్ ఎక్స్ 12ను అల్టిమేట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల అద్భుతమైన గ్రాఫిక్స్ వస్తాయి. పీసీ గేమ్స్‌ను అద్భుతమైన క్వాలిటీతో ఆడుకోవచ్చు. అలాగే ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ హోల్డర్లు పీసీ గేమ్స్ ఆడుకోవచ్చు.
ఇక విండోస్ 11 ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేయాలంటే పీసీ రిక్వయిర్‌మెంట్లు ఇలా ఉండాలి.
* 1 గిగాహెడ్జ్ లేదా అంతకన్నా ఎక్కువ వేగవంతమైన ప్రాసెసర్ ఉండాలి.
* 64 బిట్ సిస్టమ్ అయి ఉండాలి.
* కనీసం 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉండాలి.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను వాడుతున్న యూజర్లు https://download.microsoft.com/download/1/d/d/1dd9969b-bc9a-41bc-8455-bc657c939b47/WindowsPCHealthCheckSetup.msi అనే లింక్‌ను సందర్శించి తమ పీసీ విండోస్ 11 కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు సపోర్ట్ చేస్తుందో, లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇక విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లను వాడుతున్న ఎంపిక చేసిన యూజర్లకు ఈ ఓఎస్ ఉచితంగా లభిస్తుంది. కొత్తగా పీసీలను కొనేవారికి ఆటోమేటిగ్గా ఈ ఓఎస్ ఇన్‌స్టాల్ అయి వస్తుంది. ఈ ఏడాది చివరి వరకు ఈ ఓఎస్ యూజర్లకు లభిస్తుంది.