భారత యుద్ధ విమానాలతో అర్థరాత్రి ”ఆపరేష్ చైనా”….! వీడియో మీకోసమే….

-

భారత్ చైనా సరిహద్దుల వద్దా గల్వాన్ ఘర్షణ అనంతరం యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సైనికులు సరిహద్దుల వద్దా టెంట్లు కట్టుకొని మరీ బలగాలుగా నిలబడ్డారు. సైనిక స్థావరాలు, సైనిక బలగాలు, యుద్ధ ఆయుదాలు, డ్రోన్లు ఇలా అన్నీ బార్డర్లకు చేరిపోయాయాయి. భారత్ కు తోడుగా అమెరికా సైన్యం కూడా చేరింది, అమెరికా సైన్యాన్ని భారత్ కు పంపడమే కాకుండా అమెరికా యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్ర తీరంలోకి పంపింది. మరోపక్క సాక్షాత్తు ప్రధాని మోడీ సరిహద్దు వద్ద ఉన్న సైనికులను కలవడం జరిగింది.

ఇక ఇవన్నీ జరిగిన తరువాత కానీ చైనా కు బుద్ధి రాలేదు. దీంతో తోక ముడిచిన డ్రాగన్ తమ సైనికులను 2 కిలోమీటర్లు వెనక్కు పంపించింది. కానీ చైనా ను నమ్మలేము ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేము. వారు వెళ్లిపోయాము అని ప్రకటించనప్పటికీ వారికి ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. అందుకే భారత్ గత రాత్రి ఓ ఆపరేష్ ను ప్లాన్ చేసింది. ఈ ఆపరేష్ లో భాగంగా యుద్ధ విమానం మిగ్ 29 అపాచీ హెలికాప్టర్లు సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. నిజంగానే వెనక్కు వెళ్ళారా లేదా అనే అంశాన్ని తెలుసుకోడానికే ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాగా ఆ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version