విశాఖ గ్యాస్ లీక్ కేసుపై నివేదిక ఇవ్వాలంటూ ఓ హైపవర్ కమిటీకి బాధ్యత అప్పగించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని కేసులోని ప్రతీ అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా 4000 పేజీలతో నివేదిక ఇచ్చారు అధికారులు. ఇక ఈ నివేధికను నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కి బుక్ రూపం లో అప్పగించారు. ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ఎంపీ వియజయసాయి రెడ్డి తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి అంటూ సెటైర్ వేశాడు. కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు అని ఆయన తెలియజేశారు. తప్పు ఎవరు చేసిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం అని ఆయన గుర్తు చేశారు. కమిటి ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తాము అందుకే పారదర్శకంగా నివేదికను జనం ముందుంచాము అని ఆయన అన్నారు.
విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి. కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు. తప్పు ఎవరు చేసిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్నారు సీఎం. కమిటి ఇచ్చిన సూచనలను తప్పక పాటిస్తారు. అందుకే పారదర్శకంగా నివేదికను జనం ముందుంచారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 7, 2020