సైకిల్ తోక్కలేక పడుకున్న వలస కార్మికుడి సైకిల్ కొట్టేసారు…!

-

ఇప్పుడు దేశ వ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజు రోజుకి వారి కష్టాలు పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, ఝార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి లక్షల మంది కార్మికులు దక్షినాది రాష్ట్రాలకు వలస వచ్చారు. వీరిలో చాలా మందికి ఇప్పుడు ఉపాధి లేదు. ఏం చెయ్యాలో అర్ధం కాక సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు కార్మికులు.

తమ వద్ద ఉన్న ఏదో పది పరకతో వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి రెడీ అయ్యారు. ఈ తరుణంలో వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి తిండి లేక పడుకోవడానికి జాగా లేక రోడ్ల పక్కన పడుకునే పరిస్థితి ఏర్పడింది. వందల కిలోమీటర్లు రోజు సైకిల్ తొక్కి పడుకుంటున్నారు. తమిళనాడు పనికి వచ్చిన ఒక వలస కార్మికుడు బీహార్ లోని తన సొంత ఊరికి వెళ్ళాలి అనుకున్నాడు.

తన వద్ద ఉన్న సైకిల్ తో అతను వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసాడు. దాదాపు 700 కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఒక చోట ఆహారం తిని అతను కొంత దూర౦ వెళ్ళిన తర్వాత రోడ్డు మీద నిద్రకు ఉపక్రమించగా అతని సైకిల్ పోయింది.అతని పేరు బ్రిజేష్ కుమార్… దీనితో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అతనిని ప్రత్యేక రైలులో సొంత ఊరికి తరలించి, కొంత ఆర్ధిక సహాయం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version