మంత్రి అచ్చెన్నాయుడి రిక్వెస్ట్.. ఆంధ్రాకు తెలంగాణ విత్తనాలు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆర్థిక పరమైన సమస్యల కారణంగా అభివృద్ధి పనుల్లోనూ పురోగతి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి 15 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అమ్మేందుకు అంగీకారం తెలిపింది.

కిలో రూ.90 చొప్పున అమ్మేందుకు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు. విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్, హమాలీ సహా అన్ని ఖర్చులు కలిపి రూ.86 చొప్పున గిట్టుబాటు అవుతుండగా.. ఏపీకి ఎగుమతి చేయడంతో కిలో రూ.4 లాభం తెలంగాణ సీడ్ కార్పొరేషన్ లభించనుంది. ఈ మేరకు విత్తనాలు అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news