Dussehra : ద‌సరా అంటే అర్థ‌మేమిటో తెలుసా..?

-

భార‌తీయులు జ‌రుపుకునే అతి ముఖ్య‌మైన పండుగ‌ల్లో ద‌స‌రా ఒక‌టి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఆ రోజున ఉత్స‌వాలు మిన్నంటుతాయి. దుర్గాదేవిని న‌వ‌రాత్రుల పాటు పూజించి చివ‌రి రోజున విజ‌య‌ద‌శ‌మి జ‌రుపుకుంటారు.

 

భార‌తీయులు జ‌రుపుకునే అతి ముఖ్య‌మైన పండుగ‌ల్లో ద‌స‌రా ఒక‌టి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఆ రోజున ఉత్స‌వాలు మిన్నంటుతాయి. దుర్గాదేవిని న‌వ‌రాత్రుల పాటు పూజించి చివ‌రి రోజున విజ‌య‌ద‌శ‌మి జ‌రుపుకుంటారు. ఇక రాముడు రావ‌ణుడిపై విజ‌యం సాధించింది ఇదే రోజు క‌నుక‌.. ఆ నేప‌థ్యంలో రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హిస్తుంటారు. అయితే చెడుపై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా దుర్గాదేవిని పూజిస్తూ విజ‌య‌ద‌శ‌మి జ‌రుపుకుంటారు క‌దా.. మ‌రి దీనికి ద‌స‌రా అని పేరెలా వ‌చ్చిందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌సరా అంటే.. ద‌స్‌+హ‌రా.. అని అర్థం వ‌స్తుంది. అంటే.. హిందీలో ద‌స్ అంటే తెలుగులో ప‌ది (10) అని అర్థం వ‌స్తుంది. అంటే.. 10 త‌ల‌ల రావ‌ణాసురున్ని రాముడు హ‌త‌మార్చిన సంద‌ర్భం అన్న‌మాట‌. అందుక‌నే దాన్ని ద‌శ‌హ‌రా.. అని మొద‌ట్లో వ్య‌వ‌హ‌రించేవారు. ద‌శ‌కంఠుడు అన్నా రావ‌ణాసురుడ‌నే అర్థం వ‌స్తుంది. అందుక‌నే మొద‌ట్లో ద‌శ‌హ‌రా అని విజ‌య‌ద‌శ‌మిని వ్య‌వ‌హ‌రించేవారు. అది రాను రాను ద‌స‌రాగా మారింది. ద‌స‌రా అని విజ‌య‌ద‌శ‌మికి పేరు రావ‌డానికి గ‌ల కార‌ణం కూడా అదే.

 

ఇక ద‌శ‌హ‌రా అంటే 10 పాపాల‌ను తొల‌గించేది అని కూడా అర్థం వ‌స్తుంది. మ‌నుషులు శారీరకంగా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి అపాత్ర‌దానం, శాస్త్రం అంగీక‌రించ‌ని హింస చేయ‌డం, ప‌ర‌స్త్రీ లేదా పురుషునితో సంగ‌మించ‌డం. ఇక నోటి ద్వారా చేసే పాపాలు 4 ఉంటాయి. అవి ప‌రుషంగా మాట్లాడ‌డం, అస‌త్యాలు చెప్ప‌డం, వ్య‌ర్థ ప్ర‌లాపాలు చేయ‌డం, అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను ఉప‌యోగించ‌డం. అలాగే మ‌న‌స్సు ద్వారా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి ప‌రుల సొమ్మును త‌స్క‌రించాల‌నే బుద్ధి ఉండ‌డం, ఇత‌రుల‌కు బాధ క‌లిగించే ప‌నులు చేయ‌డం, అహంకారాన్ని క‌లిగి ఉండ‌డం. ఈ క్ర‌మంలోనే ఈ మొత్తం 10 పాపాల‌ను తొల‌గించేదిగా ద‌స‌రాను భావిస్తారు. ఇక ఈ పాపాలు పోవాలంటే.. ద‌స‌రా రోజున గంగాన‌ది స్నానం చేయ‌డం లేదా దుర్గాదేవిని ఆరాధించ‌డం చేయాల‌ని పురాణాలు చెబుతున్నాయి..!

Read more RELATED
Recommended to you

Latest news