ఢిల్లీ నుండి వచ్చాక అన్ని వివరాలు చెబుతా : అంబటి రాంబాబు

-

గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్‌ను బ్రో సినిమా లో పేరడీగా పెట్టడం వివాదానికి దారి తీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమేడియన్ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది.

ఈ రోజు తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. ఒక కీలకమైన విషయమై తాను వెళ్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చాక తాను అన్ని వివరాలను మీడియాకు చెబుతానని తెలిపారు. బ్రో సినిమాకు అక్రమమార్గంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని అంబటి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి తాను చెప్పాల్సింది చెప్పానని, అలాగే బ్రో చిత్ర నిర్మాత కూడా తాను చెప్పాల్సింది చెప్పారని అన్నారు. ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఎవరిదో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version