యువగళం పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చాము.. ఇప్పుడు నెరవేరుస్తున్నాం : మంత్రి ఆనం

-

ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో పలువురు మంత్రులు పాలు పంచుకున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. 2014లో టి.డి.పి.అధికారంలోకి వచ్చినా ఇక్కడ వై సి.పి కి చెందిన నేత ఎం.ఎల్.ఏ.గా గెలిచారు. 2019 లో మంత్రి ఇక్కడనుంచి ఉన్నా అభివృద్ధి లేదు అని అన్నారు.

యువ గళం పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నాం. అలాగే 2014కు ముందు ఆగిన పనులను పూర్తి చేస్తున్నాం. సోమశిల జలాశయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోమశిల కు నిధులు ఇచ్చారు. అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నాం. అయితే బిసి బాలికల గురుకుల పాఠశాల మంజూరైనా వసతి లేక ప్రారంభించలేదు. ఇప్పుడు తాత్కాలిక భవనంలో ప్రారంభించాం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news