మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం అని శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం అన్నారు ఆయన. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలతో కలిపి ఈ నగదు జమ చేస్తాం అని తెలిపారు.
ఏపీ వెబ్ ల్యాండ్ ప్రకారం 43 లక్షల మందికి పీఎం కిసాన్ వస్తోంది. వీరితో పాటు 9-10 లక్షల మంది రైతులకు మే నెలలో ఈ డబ్బు జమ చేస్తాం. బడ్జెట్లో రూ.6300 కోట్లు కేటాయించాం’ అని ప్రకటించారు. అలాగే కౌలు రైతులకు ఎలా సాయం ఇవ్వాలో ఆలోచన చేస్తున్నాం అని పేర్కొన మంత్రి అచ్చెన్నాయుడు.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారికి అండగా ఉంటాం అని అన్నారు.