చంద్రబాబు మాటల్లోనే సమన్యాయం ఉంది చేతల్లో లేదు : హరీష్ రావు

-

చంద్రబాబు మాటల్లోనే సమన్యాయం ఉంది చేతల్లో లేదు అని హరీష్ రావు అన్నారు. గోదావరి, బకచర్ల ప్రాజెక్టు సముద్రంలో వెళ్లే నీళ్లు తీసుకెళ్తే తప్పేంటని అడుగుతున్నారు. కృష్ణా నదిలో అత్యంత పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటే ఆంధ్రాకి మాత్రం 75 ఎకరాలు తీసుకుపోతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో తెలంగాణకి 968 టీఎంసీలు ఉండగా వాడకం ఎప్పుడు 200 టీఎంసీలు దాటలేదు. అందుకే గోదావరి జలాలను వాడాలని కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకి 240 టీఎంసీల అనుమతిని కేసీఆర్ సాధించారు. చంద్రబాబు బీజేపీతో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇవన్నీ చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ముఖం చాటేశారు సీఎం రేవంత్. ఇంకా ఢిల్లీని, చంద్రబాబు ని ఏమి ఎదిరిస్తారు. సీఎం చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారినే ఇక్కడ సలహదారుడిగా ఉన్నాడు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 నుంచి 40 టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయమని అన్నారు. పాలమూరు, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు చంద్రబాబు ఎందుకు అడ్డం పడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. మేము మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను కట్టుకోవద్దా అని ప్రశ్నించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news