తెలంగాణకు మోడీ 7 నవోదయ విద్యాలయాలు ఇచ్చారు : ఎంపీ అరవింద్

-

కేంద్రం ఇస్తోంది.. కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ అంటున్నారు. కానీ తెలంగాణకు మోడీ 7 జవహర్ నవోదయ విద్యాలయాలు ఇచ్చారు అని తెలిపారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నా పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ లో ఒకటి చొప్పున రెండు వచ్చాయి. పార్టీలకతీతంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా చేరతారు కాబట్టి జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించాం అని తెలిపారు.

ఇక నిజామాబాద్ లో స్టార్ట్ అయింది.. ఆల్రెడీ కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్ముర్ లో పెట్టాలని ప్రెజర్ పెడితే నేను ఆయన్ను ఒప్పించుకున్నా. అన్నీ ఒకే అనుకున్నాక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనట్టేనా.. వీళ్లకు పని చేయడం చేతకాదు. చేస్తున్న వారిని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news