ప్రతి దానికీ ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారు : బుగ్గన రాజేందర్‌

-

ఆర్థికపరమైన అంశాల్లో యనమల విషయాలను ప్రచారం చేస్తున్నారని, పార్టీ విధానంలో భాగంగా తప్పుడు విషయాలని తెలిసే యనమల ప్రకటనలు గుప్పిస్తున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌ ఆరోపించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిర్వహణ చక్కగా చేశారంటూ కాగ్ ప్రశంసించిందని బుగ్గన వెల్లడించారు. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించిందని మంత్రి బుగ్గన తెలిపారు. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్ ఫిగర్సుతో ప్రచారం చేస్తున్నారని బుగ్గన మండిపడ్డారు.

2.10 శాతం మేర మాత్రమే ఫిస్కల్ డెఫిసిట్ ఉందని, కానీ ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా ఆర్థికపరమైన అంశాల్లో కామెంట్లు చేస్తున్నారని మంత్రి బుగ్గన అగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదనే ఉద్దేశ్యమే ప్రతిపక్ష టీడీపీలో కన్పిస్తోందని, గత ప్రభుత్వంలో యావరేజీన 19.50 శాతం మేర అప్పులు పెరుగుతూ ఉంటే.. జగన్ ప్రభుత్వంలో కేవలం 15.50 శాతం మేర మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. ప్రతి దానికీ ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. డీబీటీల ద్వారా రూ. 1.40 లక్షల కోట్లు పేదలకు చేర్చామన్నారు. నాన్ డీబీటీల ద్వారా రూ. 44 వేల కోట్లు లబ్దిదారులకు చేర్చామని బుగ్గన పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version