ఏపీ హైకోర్టు జరిమానా నుంచి తప్పించుకున్న పిటిషినర్‌.. ఎలాగంటే..?

-

ఇటీవల ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరు మార్చుతున్నట్లు ప్రకటించడంతో కోనసీమ జిల్లా మార్పు చేయకూడదంటూ ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కోన‌సీమ జిల్లా పేరు మార్పుకు సంబంధించి జిల్లా కేంద్రం అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై సిట్టింగ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన పిటిష‌న‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు… పిటిష‌న‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ పిటిష‌న్ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేదిగానే ఉందంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. అంతేకాకుండా ఈ త‌ర‌హా పిటిష‌న్లు మంచిది కాద‌ని కూడా తెలిపిన హైకోర్టు.. ఈ పిటిష‌న్‌ను బాధ్య‌తార‌హిత‌మైన‌దిగా ప‌రిగ‌ణిస్తూ రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించే అవ‌కాశా‌లు కూడా ఉన్నాయ‌ని పేర్కొంది. కోర్టు వ్యాఖ్య‌ల‌తో షాక్‌కు గురైన పిటిష‌న‌ర్‌…బేష‌ర‌తుగా హైకోర్టుకు క్ష‌మాప‌ణ చెప్పారు. దీంతో ఈ పిటిష‌న్‌ను కొట్టివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది హైకోర్టు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version