అమూలు రాష్ట్ర ప్రభుత్వం సాగిలపడలేదు.. స్వాగతించిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయాడైరీ స్టాల్స్ అమూల్ పాలు అమ్మితే లాభమేనని స్పష్టంచేశారు. అమూల్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించిందని వ్యాఖ్యానించారు. ఆ సంస్థ రాకతో పాలధరలు పెరిగినా పోటీ పెరిగిందన్నారు. పాడి రైతులకు ఎక్కువ ధర లభించి లాభం కలుగుతోందన్నారు. కర్ణాటకలో ఏదో జరిగిందని మాట్లాడటం సరికాదన్నారు.
అమూల్ విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు. అమూల్ కు రాష్ట్ర ప్రభుత్వమేమీ సాగిలపడలేదని, స్వాగతించిందని స్పష్టం చేశారు. పాడిరైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ స్టాల్స్ లో అమూల్ పాలు అమ్మితే తప్పేంటి? అని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.