గాంధీజీ మార్గం మనందరికి అనుసరణీయమన్నారు : మంత్రి ఎర్రబెల్లి

-

భాతరదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం పేరిట స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించ తలపెట్టారు. అయితే.. ఈ నేపథ్యంలో.. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్‌లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలతో కలిసి కొద్దిసేపు గాంధీ సినిమాను చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప నేత గాంధీజీ అన్నారు. ఆయన అత్యంత నిరాడంబరంగా జీవిస్తూనే, అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు.

గాంధీజీ మార్గం మనందరికి అనుసరణీయమన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఆయన చూపిన దారిలోనే సీఎం కేసీఆర్‌ గ్రామ స్వరాజ్యాన్ని సాధిస్తున్నారు. మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు చాలా గొప్పవన్నారు. మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పదన్నారు మంత్రి ఎర్రబెల్లి. అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version