మంత్రి ఎర్రబెల్లి సభలో మరో మహిళకు అవమానం !

-

వరంగల్ అర్బన్ : తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మరో వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ అధికారిక కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా… మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపిపి తడుక రాణి ఆందోళన దిగింది.

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీ నైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారాలని కోరితే వినకపోతే పలువురితో టిఆర్ఎస్ నాయకులే అసభ్య పదజాలంతో పోస్టింగులు పెట్టించారని మండిపడింది. అక్కడి తో ఆగకుండా హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టింది కమలాపూర్ ఎంపిపి తడుక రాణి.

Read more RELATED
Recommended to you

Exit mobile version