కార్యకర్త అంత్యక్రియలో పాల్గొని పాడే మోసిన మంత్రి ఎర్రబెల్లి

-

పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ నూనెముంతల వినోద భర్త సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి బుధవారం సత్తయ్య మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడే మోశారు. అదేవిధంగా ఏడు నూతుల గ్రామానికి చెందిన కుదురుపాక రాములు మృతి చెందగా మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పాలకుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో బుధవారం డీఆర్‌డీఏ, జనగామ మ‌రియు ఎర్ర‌బెల్లి చారిటబుల్ ట్ర‌స్టుల సంయుక్త ఆధ్వ‌ర్యంలో పాల‌కుర్తిలోని ఓ ఫంక్ష‌న్ హాలులో నిర్వ‌హించిన మెగా జాబ్ మేళా విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ సంద‌ర్భగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఒక్కో కంపెనీ కౌంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళి, ఉద్యోగాల ఎంపిక‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఉద్యోగార్థుల‌తో ముచ్చ‌టించి, వారి అర్హ‌త‌లు, అవ‌కాశాల‌పై చ‌ర్చించారు. ఉద్యోగార్థుల‌కు, వారి వెంట వ‌చ్చిన స‌హాయ‌కుల‌కు భోజ‌నాలు పెట్టించారు. అలాగే ఆయా కంపెనీల‌కు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. ఈ రోజు జనగామ‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాది కల్పించాలని మెగా జాబు మేళా నిర్వహిస్తున్నాము. దీని వలన ఉపాధి అవకాశలు కలుగుతాయి. మొత్తం 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version