గత పది రోజుల ముందు ఇండియా రాజధాని అయిన ఢిల్లీలో జీ 20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలను మోదీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నెన్నో ఘనమైన ఏర్పాట్లను చేసి వివిధ దేశాల నుండి వచ్చిన అధికారులు, అధ్యక్షులు మరియు ప్రధానులు నివ్వెరపోయేలా చేశారు. ఈ సమావేశాలకు హాజరైన ప్రతి ఒక్కరూ మోదీని మరియు భారతీయ ఆతిధ్యాన్ని చాలా గొప్పగా పొగిడారు. ఇక ఈ సమావేశాల వలన ఇండియా మరియు ఇతర దేశాలకు మధ్యన సంబంధాలు బాగా మెరుగుడనున్నాయని తెలిసిందే. ఇక అందులో భాగంగా వచ్చే సంవత్సరం జనవరిలో జరగనున్న గణతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా ఇదే విషయాన్ని అమెరికా శ్వేతా సౌధం దృవీకరించింది.
ఇక ఇండియాకు మరియు అమెరికాకు మధ్యన బైడెన్ రావడంతో వ్యాపారం ఒప్పందాలు మరియు ఇతర అంశాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.