భవిష్యత్ తరాల కోసమే మా పోరాటం: అమర్నాథ్

-

శనివారం జరగనున్న విశాఖ గర్జన ఏర్పాట్లను అమర్నాథ్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్‌ మాట్లడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసమని అన్నారు. విశాఖ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శనివారం ఉదయం 9 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో కలసి అమర్నాథ్ పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం జరిగే ర్యాలీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు,వృద్ధులు పాల్గొని తమ ఆకాంక్షలను తెలియజేయనున్నారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలియ చేసే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు మౌనంగా ఉంటే, మన భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని, అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గర్జనకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు అమర్నాథ్. మన ప్రాంతo అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో అమరావతి రైతులు దండయాత్రగా మనపైకి వస్తున్నారని వాళ్లు కళ్ళు తెరుచుకునేలా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version