దత్తత గ్రామాల్లో ఏం చేశారు?: రేవంత్‌రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సమయం ముగియక ముందే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్‌ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌, బీజేపీల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ధైర్యం.. వారి అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని భాజపా, తెరాస చూస్తున్నాయి. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు.

అమ్ముడు పోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదు. వేలాది మంది కార్యకర్తలు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయి. దిండి ప్రాజెక్టుకు రూ.5వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించగలరా? భాజపా అభ్యర్థి ప్రాజెక్టులకు నిధులు తీసుకురాగలరా? అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అయితే.. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుంది. అలాగే నవంబర్‌ 6న జరిగే ఓట్ల లెక్కింపుతో మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిందేవరో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version