దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ : మంత్రి హరీశ్ రావు

-

దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అని.. ఒక్కొక్కడు వికలాంగుడు ఒక్కో కేసీఆర్ కావాాలని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌవరం పెంచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని.. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఖర్గే తొలి డిక్లరేషన్ చేసి.. ఇక్కడ తరువాత డిక్లరేషన్ చేయాలని మంత్రి దుయ్యబట్టారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్ లో బీడీ టేకేదార్లకు నూతన ఫించన్ మంజూరు దివ్యాంగులకు పింఛన్ల పెంపు.. పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయతీ కార్యదర్శిల ఉద్యగో క్రమబద్దీకరణ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. 

దేశంలో కర్ణాటక, ఛతీస్ గడ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి రూ.1000 ఫించన్ మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తామని చెప్పారని గుర్తు చేసి ఇప్పటికీ బండి లేదు. గుండు లేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఫాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదని.. రాష్ట్రంలో 5లక్షల 5వేల 225 మంది దివ్యాంగులు ఉన్నారని.. దివ్యాంగులు ప్రేమకలవారని.. మాట మీద ఉంటారని, మీరు అడగకున్నా పెన్షన్ పెంచారని చెప్పుకొచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version