డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులను హెచ్చరించిన బీఆర్ఎస్ మంత్రి

-

నిర్మల్ పట్టణంలోని నాగనాయి పేట్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అక్కడ మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అమ్మితే వారికి ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు మంత్రి. తరువాత , లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. శ్రావణ శుక్రవారం శుభ దినాన లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయడం చాల సంతోషంగా ఉందని వెల్లడించారు.

డబుల్ బెడ్ రూం పథకానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, స్థలం కొరత వల్ల అందరికీ సాధ్య పడదని, అలాంటి వారి కోసమే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశ పెట్టినట్లు తెలిపారు మంత్రి. ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థక సాయం అందజేస్తుందని పేర్కొన్నారు ఆయన. ఈ ఒక్క రోజే దాదాపుగా వేయి ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 43 బ్లాక్ లు ఉన్నాయని, ప్రతి బ్లాక్ కు ఒక వార్డ్ మెంబర్ ను ఎన్నుకుని, ఏవైనా సమస్యలుంటే వార్డు మెంబర్లకు తెలియాలని అన్నారు. వాళ్లు సంబంధిత అధికారులకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version