ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనేవారికి మంత్రి గుడ్ న్యూస్..!

-

పొల్యూషన్ మానవ జాతి మనుగడను సవాలుగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాలుష్యం తో ఆరోగ్యానికి ప్రమాదం కొనితెచ్చుకుంటున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ తో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాలని జ‌గ‌దీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ రాయితీ ఇస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పిస్తోందని స్ప‌ష్టం చేశారు. 130 ఛార్జింగ్ స్టేషన్ లకు అనుమతులిచ్చామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామంటూ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనుగోలు చేస్తున్న‌వారికి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 25 కిలోమీటర్ల కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యబోతున్నామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈ మధ్యే ఒక ఎలక్ట్రిక్ వాహనం కొన్నారని ఆయ‌న వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంధ‌నాల ధ‌ర‌లు కూడా పెర‌గ‌టం తో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు కొనేందుకు ప్ర‌జ‌లు ఆసక్తి చూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news