Neha Sharma: న‌న్నుసెట్లో చాలా డిఫిరెంట్ గా చూశారు.. ఆ ప‌నికి చాలా భాదప‌డ్డా.. : నేహా శర్మ.

-

Neha Sharma: ‘చిరుత’ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్ కు పరిచయమైంది నేహా శర్మ. ఆ త‌రువాత‌.. వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ, వ‌రుస అప‌జ‌యాల‌తో తెలుగు సినిమాలకు దూర‌మైంది. దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఛాన్సులు దక్కించుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ.. బిజీ అయ్యింది.

తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్నది నేహాశర్మ.. అయితే.. 2018లో ఈ అమ్మ‌డుకి సంబంధించిన ఓ సెల్ఫీని అస‌భ్య‌కరంగా మార్ఫింగ్ చేసి చేసి బ్యాక్ గ్రౌండ్‌లో సెక్స్ టాయ్‌ను యాడ్ చేశారు. అనంత‌రం నెట్టింట్లో పోస్ట్ చేశారు ఆక‌తాయిలు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఇటీవ‌ల రేడియో జాకీ సిద్దార్థ్ క‌న్న‌న్ తో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఆ ఘటన పై నేహ స్పందించింది. తాను ఇల్లీగ‌ల్ వెబ్ సిరీస్ చేస్తూన్న స‌మ‌యంలో అంద‌రూ త‌న‌తో వింత‌గా ప్ర‌వ‌ర్తించార‌ట‌. త‌రువాత అస‌లు విష‌యం తెలిసిందట‌. తాన‌తో ఎవ‌రూ కూడా మాట్లాడలేదంట‌.. కానీ ఎదో త‌న గురించి గునుగుతూ ఉన్నారు. చ‌ర్చించుకుంటున్నారని అర్థ‌మ‌య్యింద‌ట‌. అసలేం జరుగుతుంది. అందరూ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అని అనుకున్నా. చివరికి ఎవరో ఒక‌రు నా దగ్గరకు వచ్చి నేహా, ఇదిగో నీ ఫోటో వైరల్ అవుతుందని చూపించారు.

ఈ ఫోటోను చూసి తొలుత షాక్ అయ్యాన‌ని తెలిపారు. చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్‌ ఏజ్‌లో ఉన్నా. నా కెరీర్ ఏమైపోతుందోనని భయపడ్డా? అయితే నిజం ఏంటో నాకు తెలుసు. నా చుట్టూ ఉన్న వారికి తెలుసు. ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్‌ చేయడం మాత్రం దారుణం` అని నేహ చెప్పింది
ఎవ‌రైనా ఇలా ఇందుకు చేస్తార‌నిపించింది. ఎందుకు ఉద్యోగం లేకుండా ఇలాంటివి చేస్తున్నారు అంటూ ఆక‌తాయి నెటిజ‌న్ల‌కు ఘాటుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news