లోన్ యాప్ ఆగ‌డాలు ఎక్క‌వ‌వుతున్నాయి : కాకాణి

-

లోన్‌ యాప్‌ రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏకంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి రికవరీ ఏజెంట్లు డబ్బులు కట్టాలంటూ మితిమీరి మాట్లాడటంతో.. చిర్తెతుకొచ్చిన ఎమ్మెల్యే అనిల్‌ యాదవ్‌ తన తడాఖా చూపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో. పోలీసులు రంగంలోకి దిగి ఫోన్‌ చేసిన రికవరీ ఏజెంట్లను పట్టుకుని అరెస్ట్‌ చేశారు. అయితే ఇలాంటి ఘటనే వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికి ఎదురైంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. లోన్ యాప్ ఆగ‌డాలు ఎక్క‌వ‌వుతున్నాయన్నారు. దీనిపై వెంట‌నే స్పందించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, వాళ్ళ‌ గ్యాంగ్‌ను వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారన్నారు.

ఆ గ్యాంగ్ చెన్నై నుండి ఆప‌రేట్ చేస్తున్నారని, తెలుగు తెలిసిన వారి ద్వారా అక్క‌డి నుండి ఆప‌రేట్ చేస్తున్నారన్నారు. ఫోటోలు మార్పింగ్ చేసిన వారిని కూడా తీసుకు వ‌చ్చామని, ఇది ఆరంభం మాత్ర‌మేనన్నారు. ఆన్ లైన్ యాప్ ద్వారా ఎవరైనా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండని ప్రజలకు భరోసా కలిగించారు. ఫోన్ కాల్ వ‌స్తే కాల్ మ‌నీ కేసుగా వెంట‌నే చర్య‌లు తీసుకుంటామని, ఆన్ లైన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మార్పింగ్, ఫేస్ బుక్ లో పెట్టే ప‌రిస్ధితి త‌గ్గిందన్నారు. ఆన్లైన్ యాప్‌లు త్వర‌లోనే నిర్వీర్యం అయిపోతాయన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version